ఎదురుగా అగు పడుతున్న కళ్ళు మూసుకుపోయిన తీరుగా మునిసిపల్ మరియు ఆర్ అండ్ బి అధికారుల తీరు

అధికారులను ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు 

ఎదురుగా అగు పడుతున్న కళ్ళు మూసుకుపోయిన తీరుగా మునిసిపల్ మరియు ఆర్ అండ్ బి అధికారుల తీరు

ఎదురుగా అగు పడుతున్న కళ్ళు మూసుకుపోయిన తీరుగా మునిసిపల్ మరియు ఆర్ అండ్ బి అధికారుల తీరు

తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో ఎన్నో చోట్ల ఇలాంటి ఘటనలు ఉన్నా కూడా చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
 గుంతలు పడి నీళ్లు ఆగుతున్న గుర్తుపట్టారా • 
నల్లాల కోసం తీసిన గుంతలను కూడా పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు
ఇలాంటి సమస్యలకు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమా ఆర్ అండ్ బి అధికారుల అలసత్వమా? 
• అధికారులను ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు 1712725023582

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో అన్నారం వెళ్లే రోడ్డు చౌరస్తాలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయి గుంతల మయం  అవడంతో అటు వాహన దారులకు ఇటు పాదచారులకు దినదిన గండంగా మారింది. ఈ గుంతలు డ్రైనేజీని తలపించే విధంగా వాటర్ అక్కడ నిల్వ ఉండడంతో మురికి నీరుగా మారి దుర్వాసన రావడం మూలంగా, రహదారికి ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు అనారోగ్యం పాలు అవుతున్నామని వారు చెప్పుకొస్తున్నారు. కానీ మున్సిపల్ అధికారుల  నిర్లక్ష్యమా ఆర్ అండ్ బి అధికారుల అలసత్వం తెలియదు కానీ, ద్విచక్ర వాహనాలకు ప్రయాణికులకు ప్రమాదానికి కేరాఫ్ అడ్రస్ గా ఈ గుంత మారిందని ఆందోళన చెందుతున్నారు. తొర్రూర్ నగరం నడిబొడ్డున ఇలాంటి పరిస్థితి ఉందంటే మున్సిపల్ అధికారుల తీరు ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు గానీ ఆర్ అండ్ బి అధికారులు కానీ వెంటనే స్పందించి అన్నారం రోడ్డు చౌరస్తాలో చింతలపల్లి రోడ్ లో నల్లాల రిపేరు కోసం తీసిన గుంతలను మరియు రహదారి గుంతలను పూడ్చి పాదాచారులకు అటు వాహనదారులకు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Views: 77
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News