మహిళా ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు తొర్రూర్ పీఏసీఎస్ లో ఘటన.

ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అధికారులు పంటించుకోడం లేదు దళిత సంఘాల ఆరోపణ

మహిళా ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు  తొర్రూర్ పీఏసీఎస్ లో ఘటన.

మహిళా ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు

తొర్రూర్ పీఏసీఎస్ లో ఘటన.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అధికారులు పంటించుకోడం లేదు దళిత సంఘాల ఆరోపణIMG_20240412_114223

దిశ, తొర్రూరు: తొర్రూరు పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఓ మహిళ పనిచే స్తుండగా సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెలుగు మురళి సెక్రట రీగా వచ్చినప్పటి తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసినా అధికారులకు పట్టింపు లేదని దళిత సంఘాలు ఆరోపించాయి. మురళి సెక్రటరీ పదోన్నతి పొందినప్పటి నుంచి వేధింపులు ఎక్కువైనట్లు బాధితురాలు వాపోయిం ది. సదరు సెక్రటరీకి తోటి ఉద్యోగులు సహకరించ డంతో మరింత రెచ్చిపోయడాని ఆరోపించింది. లొంగకపోయే సరికి విధుల విషయంలో తప్పిదాలు వెతికి బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఉద్యోగులకు జీతాలు పెంపు విషయంలో అందరికీ రూ.4వేలు పెంచి తనకు మాత్రం రూ.2వేలు పెంచా డని ఆరోపించింది. ఇప్పటికైనా ప్రాథమిక సహకార పరపతి సంఘం అధికారులు స్పందించి మురళిని సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.

దారుణంగా టార్చర్..

Read More పాత పింఛను పథకం సాధనే ధ్యేయం...

తనను వేధించవద్దని ప్రాధేయపడినా మారకపోవ డంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితు

Read More యువ రెడ్డి నూతన కమిటీ ఎన్నిక

మాట్లాడుతున్న దళితసంఘాల నాయకులు

Read More కెజిబివి గురుకుల పాఠశాలలో వంట ఏజెన్సీలకు శిక్షణ...!

రాలు పేర్కొంది. అధికారుల అండ చూసుకొని ఉద్యోగినులతో పాటు కింది స్థాయి వర్కర్లపై క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి కీచక సెక్రటరీ మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. మహిళ వేధింపు విషయంలో వెలుగు మురళి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎస్సీ జగదీష్ బాబు తెలిపారు. ఎఫ్ఎఆర్ నమోదు చేసి డీఎస్పీకి పంపించినట్లు జగదీష్ బాబు తెలిపారు.

మురళికి ఇంత ఆస్తులు ఎక్కడివి..?

వెలుగు మురళికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆయన కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై తొర్రూరు పీఏసీఎస్ లో లోన్స్ ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికా రుల అండతో అక్రమంగా సంపాదించారని ఆరోప ణలు వినిపిస్తున్నాయి

Views: 10
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News