*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*

*- సాంప్రదాయ పంటల స్థానంలో పామాయిల్ సాగు* *- ఆదర్శంగా నిలుస్తున్న ఆయిల్ ఫామ్ రైతు అంజయ్య* *తొర్రూరు:*

*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*

*మూడేళ్లలోనే 30 టన్నుల దిగుబడి*
*- సాంప్రదాయ పంటల స్థానంలో పామాయిల్ సాగు*
*- ఆదర్శంగా నిలుస్తున్న ఆయిల్ ఫామ్ రైతు అంజయ్య*
*తొర్రూరు:*IMG-20240416-WA0040

ఏటా సాంప్రదాయ పంటల సాగుతో విసిగిపోయిన రైతు తూర్పాటి చిన్న అంజయ్య ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి మూడేళ్లలోనే దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మండల వ్యాప్తంగా 1100 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగవుతుండగా తొలి దిగుబడిని సాధించాడు.
మూడేళ్ల ఆరు నెలల కాలంలో 30 టన్నుల దిగుబడిని సాధించి ఆదర్శంగా నిలిచాడు.
 

మంగళవారం మండలంలోని కంటాయపాలెం శివారులో 30 ఎకరాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ పంట దిగుబడిని 
ఉద్యాన శాఖ డివిజన్ అధికారి రాకేష్ తో కలిసి రైతు, ఎంపీపీ అంజయ్య చూపించారు.

ఈ సందర్భంగా రైతు అంజయ్య మాట్లాడుతూ....

Read More రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

పైలెట్ ప్రాజెక్టు కింద 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు చేశానని,90 శాతం సబ్సిడీతో డ్రిప్ మొక్కలు  అందాయన్నారు. సాగుకై ఎకరాన రూ. 20 వేలు ఖర్చు చేశానని, ఆయిల్ పెడ్, ఉద్యాన శాఖల నుంచి సహకారం అందిందని తెలిపారు. అంతర పంటలుగా పత్తి, పెసర, వేరుశనగ పంటలు వేశానని పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి పంట దిగుబడి మొదలైందని ఇప్పటివరకు 30 టన్నుల దిగుబడి సాధించినట్లు తెలిపారు. టన్నుకు రూ.14,437 వస్తుందని, ఆయిల్ పెడ్ వాళ్లే పంటను అశ్వరావుపేట పరిశ్రమకు తరలిస్తారని తెలిపారు.
వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతుల కు రాయితీలు ఇస్తోందన్నారు. కంపెనీలు గ్యారెంటీ ధరలతో రైతుల వద్ద దిగుబడులను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆయిల్‌ పాం సాగువైపు దృష్టి సారిస్తున్నారన్నారు.
సాంప్రదాయ పంటలైన వరి , పత్తి వంటి పంటలను సాగు చేసి నష్టపోవడం కంటే ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కోరారు.

Read More నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..

ఈ కార్యక్రమంలో స్థానికులు రాఘవరెడ్డి, సమ్మాల్ తదితరులు పాల్గొన్నారు.

Read More ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

Views: 117
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..