పదవి విరమణ పొందిన వైద్యులు
ఘనంగా సన్మానించిన వైద్య బృందం
గూడూరు మండలం అయోధ్య పురం పాఠశాలలో వీడ్కోలు సమావేశం
గూడూరు మండలంలోని అయోధ్య పురం పాఠశాలలో మంగళవారం నాడు నేత్ర వైద్యులు గత 38 సంవత్సరాలుగా అందించిన రేణుకుంట్ల.ప్రకాశం స్వర్ణలత దంపతులకు గూడూరు మండల వైద్య బృందం ఆధ్వర్యంలో పదవి విరమణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పదవి విరమణ పొందుతున్న రేణిగుంట్ల ప్రకాశం స్వర్ణలత దంపతులకు సన్మాన కార్యక్రమం లో శాలువాతో సత్కరించి బొకే అందించడం జరిగింది. 38 సంవత్సరాలు నేత్ర వైద్యులుగా చాలామందికి వైద్య సహాయం అందించిన ప్రకాశం కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా గూడూరు మండలం అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యమునా వారికి అభినందనలు తెలిపా

రు కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అంబరీష యమునా భరత రెడ్డి సర్దార్ తదితర వైద్యులు రేణిగుంట్ల ప్రకాశం స్వర్ణలత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comment List