ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ లెనిన్ వత్సల్ టొప్పో ,అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 రబీ సీజన్లో జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు 192 ఉండగా అందులో ధాన్యం సేకరణ 102 కొనుగోలుకేంద్రంల ద్వారా 4909 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.
ఇప్పటి వరకు 24,658 మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగిందని,దాని విలువ 54.27 కోట్లు ఉంటుందని అన్నారు.
తూకం వేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లర్లకు రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని వర్షాలకు తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను ఉపయోగించాలని అన్నారు.
ధాన్యం సేకరణకు తగినన్ని లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్ 2023-24 సంబంధించిన ధాన్యం మిల్లుల ద్వారా మరాడించి బియ్యం త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డిఓ అలివేలు, తొర్రూర్ ఆర్డిఓ నరసింహారావు, డిఎం సివిల్స్ కృష్ణవేణి, డి సి ఓ వెంకటేశ్వర్లు,
డి ఎస్ ఓ రాజేందర్, డీఈఓ అభిమానులు మెక్మా విజయ ఐకెపి నళిని లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comment List