ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::

IMG-20240516-WA0078

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 

 

 గురువారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు రెవెన్యూ లెనిన్ వత్సల్ టోప్పో , ఎం.డేవిడ్ తో కలిసి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై విద్యా, రెవిన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, పోస్టల్, ఆర్టీసి తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. 

 

మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు మద్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని అన్నారు. 

 

పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ షాపులను మూసివేసి 144 సెక్షన్ విధించాలన్నారు.

 

 విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు.

 

జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు 4679 మంది విద్యార్థులకు గాను 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

 

 విద్యార్థులు, విధులు నిర్వహించే సిబ్బంది ఎవరికీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను, ఎలాక్ట్రానిక్ వస్తువులు తేవడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. 

 

ఆర్టీసి బస్సులు సమయ పాలన పాటించాలని ,పోస్టల్ అధికారులు వారికి నిర్దేశించి నియమనిబంధనలు పాటించాలని అన్నారు.

 

 

ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎస్. సత్యనారాయణ, డి.ఈ.ఓ రామారావు, ఆర్టీసి డి.ఎం. శివప్రసాద్,డిప్యుటీ డి.ఎం.హెచ్.ఓ అంబరీష్, పంచాయతీ, మునిసిపల్ శాఖ, పోస్టల్ శాఖ,విద్యుత్,పోలీసు శాఖ అధికారులు, కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భద్రకాళీ తదితరులు పాల్గొన్నారు.

Views: 54
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..