డిబిఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు

శ్రీనివాస్ రావు, ఇరిగేషన్ ఏఈ

డిబిఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు

 డిబిఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు


*అక్రమ కట్టడాలు కట్టి దారిని కబ్జా చేసిన వారిని త్వరలో పై అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం* 

*డిబిఎం 59 కెనాల్ కాల్వ ఎంతవరకు ఉందో రెండు వైపులా దారిని పూర్తిచేస్తాం త్వరలో హద్దులు కూడా నిర్మిస్తాం.*

 *శ్రీనివాస్ రావు, ఇరిగేషన్ ఏఈ*

Read More రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

*8 గుంటలు ఆక్రమించారు వినోద్ కుమార్, ఎమ్మార్వో, తొర్రూరు*

Read More ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

(న్యూస్ ఇండియా తెలుగు మే 20 మహబూబాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ డి వీరాంజనేయులు)

Read More నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..

డీబిఎం 59 కెనాల్ కాల్వ పై అక్రమ తవ్వకాలు కబ్జాలు అనే శీర్షిక ఆదివారం న్యూస్ ఇండియా దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఎలుకట్టే గ్రామ శివారులోని పిఎస్ఆర్ పాఠశాల యాజమాన్యం అక్రమంగా డీబిఎం 59 కెనాల్ కాల్వ పై అక్రమ కట్టడాలు చేపట్టడం నిజమేనని ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. సోమవారం డీబిఎం 59 కెనాల్ కాలువను ఇరిగేషన్ అధికారులు సందర్శించే సమయంలో కాలువ వద్దకు రైతులు ముక్కుముడిగా రావడంతో అధికారులకు రైతులకు ఘర్షణ మొదలైంది.
  డీబీఎం 59 కెనాల్ కాలువ పీఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం అక్రమంగా కట్టడాలు నిర్మించడం నిజమే. కానీ కోర్టులో కేసు నడుస్తోంది. జూన్ 16న హియరింగ్ ఉండడం వలన మేము అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వెనుకాడుతున్నాము. అదేవిధంగా ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం తో పాటు డీపీఎం 59 కెనాల్ కాల్వకు ఇరువైపులా హద్దులు నిర్మించి రైతులకు మేలు చేస్తాం. పట్టణ కేంద్రంలోని బృందావనం దాబా నుండి పాల కేంద్రం వద్ద పెద్దవంగర రోడ్డు వరకు సుమోరుగా 1 కిలోమీటర్ 235 మీటర్లు పొడవు ఇరువైపులా హద్దులు నిర్మించి ఎవరు కూడా కెనాల్ కాల్వను కబ్జాకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటాం. కాల్వకు ఒక్క వైపు 33 మీటర్లు మరొకవైపు 44 మీటర్లు ఉండాలి. కానీ 33 మీటర్లు ఉన్న కాల్వపై పిఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం అక్రమ కట్టడాలు నిర్మించింది వాస్తవమే త్వరలోనే అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరుగుతుందని తదుపరి హద్దులు నిర్మిస్తామని ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ రావు తెలిపారు.
  పీఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం డీపీఎం 59 కాలువ పై సుమారుగా 8 గుంటల స్థలం ఆక్రమించుకొని ఈ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేము జూన్ 16న సబ్మిట్ చేయాల్సిన వివరాలు అందుబాటులో ఉంచుకున్నాం. మొత్తానికి ఎనిమిది గుంటల నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి స్థలంను స్వాధీనం చేసుకొని రైతులకు వీలుగా ఉండే విధంగా పనులు చేపడతామని తొర్రూర్ తాసిల్దారు వినోద్ కుమార్ తెలిపారు.

Views: 157
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..