నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రక్తదానం ప్రాముఖ్యత హెచ్.ఐ.వి / ఎయిడ్స్ నిర్మూలన పై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం

On
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రక్తదానం ప్రాముఖ్యత హెచ్.ఐ.వి / ఎయిడ్స్ నిర్మూలన పై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం

ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో, జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు అకౌంటెంట్ మరియు  ప్రోగ్రామ్స్అ ధికారి కమరతపు భానుచందర్ సహకారంతో కె.సి.ఆర్ నగర్ యూత్ క్లబ్ వారు  హెచ్.ఐ.వి / ఎయిడ్స్ లో భాగంగా రక్తదానం ప్రాముఖ్యత మరియు ఎయిడ్స్ నిర్మూలన పై ఖమ్మంలో కొన్ని డివిజన్స్ 50 ఇల్లు  డోర్ టు డోర్ తిరిగి అవగాహన ఇవ్వడం జరిగింది. "హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పై అవగాహన పెంపొదిద్దాం, హెచ్.ఐ.వి రహిత సమాజాన్ని సాధిద్దాం" అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. తగు జాగ్రత్తలు పాటించకపోతే హెచ్.ఐ.వి / ఎయిడ్స్ ఎవరికైనా సోకవచ్చు. మనలో చాలామందికి తమ హెచ్.ఐ.వి స్థితి తెలియదు. హెచ్.ఐ.వి నాలుగు విధాలుగా మాత్రమే సోకుతుంది. అసురక్షిత లైంగిక సంబంధాల ద్వారా, కలుషితమైన సూదులు - సిరంజీల ద్వారా, కలుషితమైన రక్తాన్ని మరొక్కరికి ఎక్కించడం ద్వారా, హెచ్.ఐ.వి సోకిన తల్లి నుండి పొట్టబోయే బిడ్డకు అని వివరించి మరియు "రక్తదానం చేద్దాం నాలుగు నిండు ప్రాణాలను కాపాడుదాం" అనే అంశాన్ని కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు, కె.సి.ఆర్ నగర్ యూత్ క్లబ్ అవగాహన ఇవ్వడం జరిగింది.

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..