పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

భయంతో బాధితుడు ఆత్మహత్య ప్రయత్నం...తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయం ముందు బాధితుల ధర్నా.....

పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

9 సంవత్సరాల క్రితం కేసులను వెలుకి తీసి 50 వేల రూపాయలు ఆప్కారి పోలీసులు డిమాండ్ చేశారని అందుకే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని బాధితులు.. ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కొమ్మనపల్లి శివారు కపుర్య తండాకు చెందిన నూనవత్ బీముడు అనే వ్యక్తిపై తొమ్మిదేళ్ల క్రితం కేసులను వెలికి తీసి 50 వేలు రూపాయలు ఆప్కారి అధికారుల డిమాండ్ చేశారని... స్పందించని ఎడల భౌతిక దాడులు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కారి పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి నుననత్ భీముడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని అవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల పక్షాన తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులు అని చూడకుండా మహిళలని చూడకుండా  అధికారుల మనే. అహంకారంతో గిరిజన కుటుంబం పై ఇలాంటి దౌర్జన్యం సరికాదు అన్నారు బాధితులను ఇంతటి అవమానపరిచిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని పై అధికారులను కోరారు..

Views: 126
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News