ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ కానుపులను చేయాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాకాధికారి డాక్టర్ కళావతి బాయి

ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి

IMG-20240608-WA0027
వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి ప్రజలకు ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించేలా అవగాహన కలిగించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి కళావతి బాయి పేర్కొన్నారు.
 
శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలోని  ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు గ్రామాన్ని సందర్శించి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మురుగు గుంతలను పూడ్చివేయాలని, నీరు ఎక్కువగా నిల్వవున్న కుంటలలో ఆయిల్ బాల్స్ కానీ, కిర్శనాయిల్ గాని,  వేయాలని కొబ్బరిబొండాలు, పాడై పోయిన టైర్లు, మొదలగువాటిని ఇంటి చుట్టూ ప్రక్కల వుంచకుండా చూడాలని పేరుకొన్నారు. జ్వరం తో బాధపడుతున్న వారికి రక్తపూతలు తీయాలనీ రానున్న వర్షాకాలము లో అంటూవ్యాధులు ప్రబలకుండా చూసుకోవడానికి ముందస్తు ప్రణాలికలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి   కేంద్రం పరిధిలో సాధారణ కాన్పులను  చేయాలని వైద్యాధికారికి మరియు స్టాప్ నర్సుకు ఆదేశించారు.  సి సెక్షన్ కాన్పులను తగ్గించుటకై వైద్య ఆరోగ్య సిబ్బంది తల్లుల సమావేశంలో గర్భిణీ స్త్రీలకు మరియు వారి బంధువులకు సాధారణ ప్రసవాల వలన చేకూరే ప్రయోజనాలను వివరించాలని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలము సీజన్ లో సిబ్బంది అందుబాటులో వుండాలని ప్రతి గర్బిణి స్త్రీ ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం కొరకు ప్రోత్సహించాలని ఆమె పేరుకొన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాలు జరగకుండా చూడాలని, ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న గర్భస్రావాల పైన నిఘా ఉంచాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న టిబి స్పూటం క్యాంప్ ను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
 
ఈ కార్యక్రమంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి , జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పుప్రసాద్, ఎం‌పి‌హెచ్‌ఈ‌ఓ బిక్షపతి, ఇన్చార్జి డిపిహెచ్ఎన్ఓ మంగమ్మ,స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 15
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు: రైతులు దగ్గర పరిమితికి మించి పండించినటువంటి అదనపు పొగాకును ప్రభుత్వం ఎలాంటి అదనపు సుంకం వసూలు చేయకుండా కొనుగోలు చేయాలని సిపిఎం హనుమంతునిపాడు...
అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
పదవులలో పాలకవర్గం
పదవులలో పాలకవర్గం బాధ్యతలు
యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
కేజీబీవీ లలో సీట్లు పెంచి బాలికల విద్యను ప్రోత్సహించండి: పి.డి.ఎస్.యు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - టిడిపి నాయకులు