ఏఈఓ ల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి
వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు రైతుల ధర్నా.
గ్రామాలలో వ్యవసాయ సీజన్ సమయం లో రైతులకు అనుసంధానంగా ఉండేటువంటి aeo లను సస్పెండ్ చేయటం బాధాకరమని, నీతిపరులైన ఏఈఓ ల సస్పెన్షన్ వెనక్కి తీసుకోవాలని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండలం లోని రైతులు మాట్లాడుతూ ఏవో సోమకుమార్, ఏడిఏ లు చేసిన జిలుగా విత్తనాల అవినీతి కూపం నుండి తప్పించుకోవాలని కింది స్థాయి ఉద్యోగులైన ముగ్గురు ఏఈఓ లు జమున,దీపిక,అరవింద్ లను సస్పెండ్ చేయడం వ్యవసాయ శాఖ పనితీరును బ్రష్టు పట్టించే విధంగా ఉందని మండిపడ్డారు. జీలుగు విత్తనాల దందాలో ఎటువంటి ప్రమేయం లేని ఏ ఈ ఓ లను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. గత నెల 18 నుండి 22 తారీకు మధ్యలో ఏవో కుమార్ చేయాల్సిన పని ఎంత చేసి జీలుగు విత్తనాలను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని తను ఈ అవినీతి నుండి తప్పించుకోవాలని కింది స్థాయి ఉద్యోగులైన ఏఈఓ లను దీంట్లో లాగడం వల్ల రైతులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఈ అవినీతి మీద విచారణ అధికారిగా వచ్చిన ఏడిఏ కూడా జరిగిన అవినీతిలో భాగమని ఏ ఒక్క రైతుల దగ్గర విచారణ చేయకుండ , విక్రయ కేంద్ర లా యజమానులు ఇచ్చిన రిపోర్టు లో కూడా ఏ ఈ ఓల పాత్ర లేదని చెప్పిన కూడా,ఏఈఓ లు ఇచ్చిన సంజయసి ఎంక్వయిరీ రిపోర్టును కూడా తారుమారు చేసి పై అధికారులకు పోనీయకుండా ఏడీఏ జాగ్రత్త పడ్డారని అన్నారు. శ్రీ అవినీతి మీద విస్పక్షపాతమైన విచారణ జరిపించాలని అన్నారు. తక్షణమే విజిలెన్స్ అధికారులు ఈ విషయం పట్ల నిష్పక్షపాత విచారణ జరిపించాలని, లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మాలోతు సురేష్ బాబు, ఐలయ్య ,భూపతి, రాజేందర్ సైదా నాయక్, సాయిరాం, రవి, పాప, నరసింహ, దేవేందర్, రాజబాబు, బీరియా నాయక్, లాల్ సింగ్, కిస్తూ, పద్మ, కాళి, స్వాతి, పులమ్మ, కమల, పిచ్చమ్మ, బుజమ్మ, విమల
Comment List