పదవులలో పాలకవర్గం
వైస్ చైర్మన్ గా ఎడ్ల నరేష్ రెడ్డి
డైరెక్టర్గా సమ్మెట శ్రీను కందిక సుమలత
గూడూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నెక్కొండ మార్కెట్ కమిటీలలో పదవులు దక్కాయి. నరేష్ రెడ్డిని నెక్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ గా, డైరెక్టర్లుగా బ్రాహ్మణపల్లి సీనియర్ నాయకులు సమ్మెట శ్రీను, గ్రామస్తులైన కందిక సుమలత లను నియమించబడ్డారు పార్టీలో నిత్యం పాల్గొంటూ ప్రతి వ్యవహారంలో తనదైన శైలిగాముద్రవిస్తూ గెలుపుకై అహర్నిశలు కష్టపడ్డా కార్యకర్తలకు ఫలితం ఉంటుందని గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి, వాంకుడోత్ కొమ్మలు, జిల్లా నాయకులు ప్రదీప్ రెడ్డి లు వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు మేలు జరిగే విధంగా పార్టీ ఆదుకుంటుందని ఎవరు అధైర్య పడవద్దని వారన్నారు వారి పదవులకు సహకరించిన మహబూబాద్ భూక్య మురళి నాయక్ నర్సంపేట దొంతి మాధవరెడ్డికి, ఇరువురు ఎమ్మెల్యేలకు మండలంలో సీనియర్ నాయకులకు ఎడ్ల రమేష్ సమ్మెట శ్రీను కందిక సుమలత లు కృతజ్ఞతలు తెలిపారు.
Comment List