నీట్ పరీక్ష రద్దు చేయండి

కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా

On

పరీక్ష పేపర్ లీకేజీలో బిఆర్ఎస్ బిజెపి ఒకటే

 

 

*కొత్తగూడెం ...బస్ స్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు నిరసనలు*..

 

*దోషులను కఠినంగా శిక్షించాలి*...

 

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష -2024 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, పరీక్షలలో భారీ సంఖ్యలో ఒకే రాష్ట్రంలో అధిక సంఖ్యలో టాపర్లు రావడంతో దీనిపై అనుమానాలు మొదలయ్యాయి.చివరికి అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దర్యాప్తు చేస్తోంది. బీహార్ రాష్ట్రంలో దళారులు ప్రశ్నాపత్రాన్ని లీకేజ్ చేసి అమ్ముకున్నారని దర్యాప్తు సంస్థ తేల్చింది నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ పరీక్షలను తిరిగి నిర్వహించాలని సూచించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఈకార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, తూము చౌదరి, పెద్దబాబు, కోనేరు సత్యనారాయణ, డాక్టర్ శంకర్ నాయక్ ,షేక్ మసూద్, చీకటి కార్తీక్, సుందర్లాల్ కోరి, పాల సత్యనారాయణ రెడ్డి, బాల ప్రసాద్, కొంచెం వెంకటేష్, సోమిరెడ్డి, సింగరేణి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంబరం, నాగిరెడ్డి, రావి రాంబాబు, సుందర్ రాజ్, మాజీ ఎంపీపీ కేస్లీ ,జిల్లా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు వై. శ్రీనివాస్ రెడ్డి, అనిల్, పరమేష్ యాదవ్, మధుసూదన్, పూర్ణ, సూరి, రాఘవాచారి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*...

Views: 5
Tags: breaking

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.