10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

On
10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

IMG_20240621_103710145_HDR_AE (1)ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర, ఆధ్వర్యంలో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్ మరియు హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వారు ఖమ్మం నగరంలోని ప్రగతి మోడల్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా యోగ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ ఖమ్మం జిల్లా చైర్మన్ చిలకబత్తిని కనకయ్య, మరియు కమిటీ సభ్యులు సంకా గణేష్, చింతల రవి, కొప్పుల రామకృష్ణ, నీరుడు రాంబాబు, మరియు స్కూల్ కరస్పాండెంట్ సుమలత, ప్రిన్సిపాల్ మరియు యోగ మాస్టర్ హనుమంతరావు, హాజర్ అవ్వగా  సంస్థ చైర్మన్ కనకయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదన చేశారనీ, ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారనీ, యోగా అనేది మానవులకు మంచే కలుగజేస్తుందని, యోగ ప్రతిరోజు చేయడం వలన జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని సకల రోగాలకు చెక్ పెడుతుందని అన్నారు. అనంతరం హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతూ మానవ హక్కులను ఉల్లంఘన చెస్తే ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్షించవచ్చని అన్నారు.  మా సంస్థ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు, మీ పెద్దలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యపై అవగాహన కల్పించి వారి హక్కును వినియోగించుకునే విధంగా సంబంధిత అధికారికి  సమన్వయపరిచి న్యాయం జరిగే వరకూ మీ తరఫున పోరాడుతామని అన్నారు, పిల్లలు చిన్నతనం నుంచే మంచి మార్కులు సంపాదించుకుంటూ మంచి అలవాట్లకు నేర్చుకుంటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తన చుట్టూ ఉన్నవారికి మంచి చేసే గుణం కలిగి వుండాలి అని అన్నారు. అనంతరం యోగ మాస్టర్, యోగా చేస్తూ దాని గురించి వివరించి మరియు అక్కడున్న స్టూడెంట్స్ తో యోగ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవంతం జరిగినందున, హ్యూమన్ రైట్స్ మరియు యూత్ అసోసియేషన్ వారు స్కూల్ యజమానియానికి కృతజ్ఞతలు తెలిపారు.

IMG_20240621_115441584

Views: 67
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*