ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న పోలీసులు

వివరాలు వెల్లడించిన వన్టౌన్ సిఐ కరుణాకర్

On
ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న పోలీసులు

వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు

కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )జూన్ 28: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఎస్సై విజయ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసు వారిని చూసి ద్విచక్ర వాహనంతో అటుగా వస్తున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతనిని పట్టుకున్నారు.అనంతరం అతనిని విచారించగా అతని పేరు సల్లా చంద్రశేఖర్,S/o.ముసలయ్య,38yrs,R/o.హోసింగ్ బోర్డు కాలనీ, చుంచుపల్లి, N/o.రత్నాల చెరువు,మంగళగిరి,గుంటూరు జిల్లా అని తెలిపాడు.కొత్తగూడెం బస్టాండ్ ఏరియాలో మూడు బైకులను దొంగతనం చేసినట్లుగా అతను అంగీకరించడం జరిగిందని వన్టౌన్ సిఐ కరుణాకర్ వివరాలను వెల్లడించారు.నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు.ఇట్టి విషయంలో ప్రతిభగానపరిచిన హెడ్ కానిస్టేబుల్ ఘని,కానిస్టేబుళ్ళు సురేష్,వీరన్న,నరేష్ మరియు ప్రసాద్ లను ఈ సందర్బంగా సిఐ అభినందించారు.

Views: 53
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News