కీ"శే" స్వర్గీయ కళ్లెం పెంటా రెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా ఎసి కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం...

On
కీ

IMG_20240630_213245
ఏసీ కన్వెన్షన్ హాల్ ని ప్రారంభిస్తున్న "క్రీస్తు శేషులు" స్వర్గీయ కళ్లెం పెంట సతీమణి

కీ"శే" స్వర్గీయ కళ్లెం పెంటా రెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా ఎసి కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం...

ఎల్బీనగర్, జూన్ 30 (న్యూస్ ఇండియా ప్రతినిధి): హయత్ నగర్ గ్రామ పెద్దలు కీ"శే" స్వర్గీయ కళ్లెం పెంటా రెడ్డి తృతీయ  వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి సోదరులు కళ్లెం చెన్నారెడ్డి, శంకర్ రెడ్డి, వారి కుమారులు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, జైవర్ధన్ రెడ్డి హయత్ నగర్ లోని వినాయక నగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనం నందు మొదటి అంతస్తులో నిర్మించిన ఎసి కన్వెన్షన్ హాల్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీ"శే" కళ్లెం పెంటా రెడ్డి సనిహితులు మాట్లాడుతూ హయత్ నగర్ గ్రామంలోని ప్రతి ఒక్క పేద విద్యార్థులకు విద్యను అందించాలనే పట్టుదలతో హయత్ నగర్ లో ఉన్నటువంటి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అభివృద్ధికి వారు ముందుండేవారని, కేవలం హయత్ నగర్ లోనే కాకుండా పరిసరాల్లో ఉన్న ఊళ్ళల్లో కూడా బడులు మరియు ఆలయ నిర్మాణంలో  వారి సహాయ సహకారాలు ఉండేవని, లయన్స్ క్లబ్ గవర్నర్ గా వారు ప్రతి సంత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని వారు తెలిపారు. కీ"శే" స్వర్గీయ కళ్లెం పెంటా రెడ్డి తనయుడు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మా నాన్న గారే మాకు మార్గ దర్శకులని వారు ప్రతి క్షణం హయత్ నగర్ గ్రామ అభివృద్ధి కోసమే పాటుపడ్డారని, మా కుటుంబానికి హయత్ నగర్ గ్రామానికి  వారు లేని లోట్టు ఎన్నటికీ తీర్చలేనిది, వారు చూపిన సేవ మార్గంలో నడుస్తూ హయత్ నగర్ గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా వారి కుటుంబ  సహాయ సహకారాలు ఉంటాయని  వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, వినాయక్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వసూలు తదితరులు పాల్గొన్నారు.

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.