స్వచ్ఛ ఆదిభట్ల కార్యక్రమంలో పాల్గొన్న: మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి..

On
స్వచ్ఛ ఆదిభట్ల కార్యక్రమంలో పాల్గొన్న: మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి..

ఇబ్రహీంపట్నం, జులై 03 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బుధవారం ఉదయం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ ఆదిభట్ల కార్యక్రమంలో భాగంగా, మంగళపల్లి పటేల్ గూడలో మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్ర, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా వార్డులలో వివిధ శాఖల అధికారులతో కలిసి గడపగడపకు తిరుగుతూ ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తింప చేస్తామని అన్నారు. మంగళపల్లి పటేల్ గూడ లోని ప్రధాన రహదారి పక్కన పేరుకుపోయిన మురికి, చెత్తా చెదారాన్ని జెసిబి ద్వారా తొలగించారు. ఇరిగేషన్ అధికారులను స్పాట్ వద్దకు పిలిచి తాసిల్దార్ తో ఫోన్లో మాట్లాడి సర్వే చేసి వాగు అద్దురాలను గుర్తించి రానున్న రోజులలో వాకింగ్ ట్రాక్  ఏర్పాటు చేద్దామని సూచించారు. మరి ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని అన్నారు. ప్రజల సౌకర్యార్థం వీధి దీపాలు, త్రాగునీరు, తక్షణమే ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి డ్రైనేజీ చెత్తాచెదారం ఉన్నచోట వాటిని వెంటనే తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కామండ్ల యాదగిరి, కమిషనర్ బాలకృష్ణ, మాజీ జెడ్పిటిసి పొట్టి ఐలయ్య, మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మర్రి రామ్ రెడ్డి, గ్రామ పెద్దలు, కాలనీవాసులు, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 89

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం తులస్య తండాలో తెల్లవారుజామున దాడులు – 20 లీటర్ల గుడుంబా స్వాధీనం మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు:తొర్రూరు మండల పరిధిలో గుడుంబా తయారీ,...
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో