డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే పట్టణ వ్యర్ధాలు
కలెక్టర్ వస్తున్నారని తొర్రూర్ మున్సిపాలిటీ అధికారుల గుండెల్లో గుబులు
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే పట్టణ వ్యర్ధాలు
అధికారులు వస్తేనే పట్టణ వ్యర్ధాలు తొలగింప.....?
20 లక్షలు మంజూరైన డంపింగ్ యార్డ్ ఎక్కడ....?
కలెక్టర్ వస్తున్నారని తొర్రూర్ మున్సిపాలిటీ అధికారుల గుండెల్లో గుబులు
ఎక్కడలేని హడావుడి.... సిబ్బందితో తాత్కాలికంగా డంపింగ్ చెత్త తరలింపు
మున్సిపల్ సిబ్బంది హడావిడి చూసి ఆశ్చర్యానికి గురౌతున్న స్థానికులు ప్రజలు
ఏళ్ల తరబడి మొత్తుకున్న చేయని పనులు..... ఈరోజు సిబ్బంది హడావుడి చూసి ఆశ్చర్య చెకుతులు అవుతున్నారు
ఏళ్ల తరబడి స్థానికులు డంపింగ్ యార్డ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నామని తొర్రూర్ మున్సిపాలిటీ ప్రజలు చెబుతున్న పట్టించుకోకుండా ఎన్నిసార్లు ప్రజలు అధికారులకు రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్న చేయని పనులు సోమవారం రోజున కలెక్టర్ వస్తున్నారని సమాచారంతో ఎక్కడలేని హడావుడి చూసి డంపింగ్ యార్డ్ లో వేయవలసిన చెత్తను ప్రవేట్ స్థలాల్లో వేస్తూ...ప్రధాన రహదారి ప్రక్కన వేస్తున్నారు. ఇట్టి విషయంపై మున్సిపాలిటీ ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గాని పట్టించుకోకుండా కలెక్టర్ రాకతో హడావుడి చేస్తున్న సంఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.చేసుకోవడం స్థానికులను, ప్రజలను ఆశ్చర్య చెకుతులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో రోజువారి చెత్త చెదారం వేసే డంపింగ్ యార్డ్ అచ్యుతండా వాసుల పక్కనే ఉండడం అందులో అనేక వ్యర్ధ మరియు కుళ్లిపోయిన జంతు కళేబారాల, వాసన, కాలబెడితే వచ్చే పొగ వల్ల ఆ తండావాసులు నానా ఇబ్బందులు పడుతున్నామని, పెద్దలు పిల్లలు అనారోగ్యం పాలవుతున్నామని ఏళ్ల తరబడి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నిరసనలు చేసిన పట్టించుకోని అధికారులు సిబ్బంది నేడు జిల్లా కలెక్టర్ తోరూర్ పట్టణ కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని తెలిసి మున్సిపాలిటీ అధికారులకు సిబ్బంది ఎక్కడలేని హడావిడి చేసి రోడ్లపై ఉంచిన చెత్తను వేరే చోటుకు తరలిస్తూ, ఎన్నడూ కాలువల పక్కల చెత్తాచెదారం తీయని సిబ్బంది ఈరోజు ఇంత హడావుడి చేస్తున్నారు.
ఒక సందర్భంలో తండాకు మున్సిపాలిటీ బండ్లను రానివ్వకుండా తండావాసులు నిరసన తెలియజేసి మీడియా ద్వారా పత్రికల ద్వారా కూడా తెలియపరచడం జరిగింది దానికి అప్పటికప్పుడే మున్సిపాలిటీ అధికారులు ఆకస్మిక..... ఏర్పాటుచేసి 20 లక్షల రూపాయలు రిలీజ్ అయ్యాయని పనులు వెంటనే ప్రారంభిస్తున్నామని అదే మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలిపారు కానీ ఇంతవరకు ఏ ఒక్క పని కూడా చేయకుండా కాలం వెళ్ళబుతున్నారని తండావాసులు వాపోయారు.
ఇప్పటికైనా కలెక్టర్ గారు మా తండావాసుల బాధను తొరూరు ప్రజల బాధను అర్థం చేసుకొని మా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా అభివృద్ధి పనులు త్వరగా చేయాలని వేడుకుంటున్నారు
Comment List