సుభాష్. పోలీసన్నా.....మానవీయ కోణాన్ని ఆవిష్కరించడంలో మాకు మేమే సాటి

పోలీస్ డిపార్ట్మెంట్ కి వన్నె తెచ్చే పోలీసులు ఉన్నారని నిరూపించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ర కేకన్ IPS

సుభాష్. పోలీసన్నా.....మానవీయ కోణాన్ని ఆవిష్కరించడంలో మాకు మేమే సాటి

IMG-20240728-WA0070 ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ సామాజిక రుగ్మతలను రూపు మాపడమే కాదు..
మానవీయ కోణాన్ని ఆవిష్కరించడంలో మాకు మేమే సాటి అని నిరూపిస్తున్నారు మానుకోట జిల్లా పోలీస్ లు..

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రాంనాధ్ కేకన్ IPS  తన మార్కు చూపిస్తూ జిల్లాలో  గుడుంబా,నల్ల బెల్లం,గంజాయి సాగు రవాణాపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు..

 జిల్లా లో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ ప్రమాదాల బారిన పడి అమాయక కుటుంబాలు రోడ్డున పడటం తో చలించిన ఎస్పీ  రోడ్ల మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు..

దీన స్థితి లో వున్నా రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి, అటవీ ప్రాంత యువకులు కి వాలీ బాల్, క్రికెట్ కిట్స్ అందివ్వడం లాంటి సామజిక కార్యక్రమాలు చేస్తు కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తూ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతూ మానవీయతను చాటుకుంటున్నారు,..


అసాంఘిక కార్యకలపాల పై దృష్టిని కేంద్రీకరించే పోలీస్ బాస్ కు నర్సింహుల పేట మండలం పెద్ద నాగారం గ్రామానికి చెందిన అంధత్వం గల వ్యక్తి దీనస్థితి నీ గురించి స్థానిక ఎస్ ఐ  గండ్రతి సతీష్ ద్వారా విషయాన్ని తెలుసుకున్నారు..

 

ఎస్పీ ఆదేశాలతో తన సిబ్బందితో కలిసి పెద్ద నాగారం గ్రామానికి చేరుకుని వ్యక్తి దీనస్థితి నీ చూసి చలించిన ఎస్ ఐ తక్షణ సహాయంగా కొన్ని నిత్యావసర వస్తువులను అందించడం తో పాటు బాధితుడికి ఉండటానికి ఇల్లు లేని విషయాన్ని ఎస్పీ దృష్టికి ఎస్ ఐ తీసుకెళ్లారు..


స్పందించిన ఎస్పీ ఇంటి నీ నిర్మించి ఇచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు..తన వంతుగా సహాయం చేయడం తోపాటు.. నర్సింహుల పేట స్టేషన్ సిబ్బంది,కొంత మంది దాతలను ముందుకొచ్చేల చేశారు..


ఎస్పీ సహాయ సహకారాలతో పాటు,దాతల సహకారంతో  ఇంటి నిర్మానాన్ని పూర్తి చేసారు..

 స్వయంగా పెద్ద నాగారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు చేస్తున్న గృహ ప్రవేశానికి హాజరయ్యి తమ సహకారం ఆ కుటుంబానికి ఏళ్ల వేళలా ఉంటుందని భరోసా కల్పించారు..


మానవీయ కోణంలో స్పందించి సహాయం అందించడంలో తోడ్పాటు ఇచ్చిన జిల్లా ఎస్పీకి బాధిత కుటుంబం,తోపాటు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు..

Views: 2
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి