మద్యం మత్తులో వ్యక్తి  హల్ చల్………వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని బెదిరింపులు

తొర్రూర్ ఎస్ఐ కూచిపూడి జగదీష్

మద్యం మత్తులో వ్యక్తి  హల్ చల్………వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని బెదిరింపులు

మద్యం మత్తులో వ్యక్తి  హల్ చల్………వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని బెదిరింపులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైకి ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన పప్పుల కుమార్ అనే వ్యక్తి మత్తుమందులో కిందకు దూకుతానని హల్చల్ చేశాడు. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు దళిత బంధు ఇస్తానని హామీ ఇచ్చాడని, ఎర్రబెల్లి దయాకర్ రావు జిందాబాద్ అంటూ... ఇక్కడికి ఎర్రబెల్లి దయాకర్ రావు రావాలని నినాదాలు ఇస్తూ.... దూకుతానని బెదిరింపులు చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...పప్పుల కుమార్ గురువారం రోజున తొర్రూరు మండల చింతలపల్లి గ్రామానికి చెందిన కుమార్ అక్క, కమటం నరసమ్మ ఇంటికి వచ్చాడు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు మద్యం తాగి ఆ
మత్తులో తొర్రూరు పట్టణంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నాకు
దళిత బంధు ఇవ్వాలంటూ, ఎర్రబెల్లి ఇక్కడకి రావాలని
అంటూ నినాదాలు చేస్తూ దూకుతానని బెదిరింపులు
చేశాడు.సంఘటన స్థలంలోకి పోలీసులు, బంధువులు
వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా దూకే
ప్రయత్నం చేశాడు. చివరికి కుమార్ ను పోలీసులు,
స్థానికుల సహాయంతో కిందకి దించాడు. ఎస్సై జగదీష్
ను వివరణ కోరగా.. తగిన మత్తులో ట్యాంక్ ఎక్కి దళిత
బంధు కావాలని బెదిరింపులకు గురి చేశాడు. స్థానికుల
సహాయంతో కిందకి దింపి కౌన్సెలింగ్ ఇచ్చామని ఎస్సై
జగదీష్ తెలిపారు.

Views: 4
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..