వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో

పాల బిల్లుల కోసం పాడి రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది

By Venkat
On
వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో

ధర్నా చేస్తున్న పాడి రైతులు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ IMG-20240809-WA0300

పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలంటూ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. 

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులు, తమకు రావలసిన ఐదు విడతల బిల్లులు చెల్లించడం లేదంటూ ఆందోళన చేశారు. విజయ డైరీ ఎండికి మొరపెట్టుకున్న ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో అంటూ తలా తక లేని సమాధానం చెప్పారని మండిపడ్డారు.పాల బిల్లులు చెల్లించడం లేదని పలుమార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశు సంవర్థక శాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి 2 సార్లు తీసుకెళ్లిన సమస్య తీర లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతుల పిలుపుమేరకు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఇదేమి రైతు సంక్షేమ ప్రభుత్వమని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సాదం రమేష్, వడ్లురి వేంకటాద్రి, గోడిశాల వెంకటయ్య, G కుమార్, కాసాని నాగరాజు, కత్తుల రాజు, చొక్కం రాములు, పండుగ రవి, మునిగల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు