మిషన్ పరివర్తన లో భాగంగా నల్లగొండ జిల్లాను గాంజా రహిత జిల్లా గా మారుస్తా... ఎస్పీ శరత్చంద్ర పవర్

కట్టంగూర్ గ్రామ శివారులో ముగ్గురు యువకులు గాంజా తరలిస్తుండగా పట్టుబడ్డ ఎస్ఐ శీను

On
మిషన్ పరివర్తన లో భాగంగా నల్లగొండ జిల్లాను గాంజా రహిత  జిల్లా గా మారుస్తా... ఎస్పీ శరత్చంద్ర పవర్

శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండల్ రెడ్డిని అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ శీను అభినందించిన ఎస్పీ శరత్చంద్ర పవర్

న్యూస్ ఇండియా తెలుగు,ఆగస్టు 11 (నల్గొండ జిల్లా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది.తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ మిషన్ పరివర్తన్ లో భాగంగా నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కోసం ఏర్పరిచారు.దీనిలో భాగంగా కట్టంగూరు ఎస్సై శ్రీను సిబ్బందితో పరివేక్షణలో భాగంగా నాడు అనగా పదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు కట్టంగూరు శివారులో ఈదులూరు రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న తరుణంలో వెంబడించి పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 740 గ్రాములు, అలాగే దీని విలువ వచ్చేసి 18,600రూపాయలు ఉంటుంది.నిందితులు కురిమెళ్ళ శివప్రసాద్ A1 గా,మంద మధు A2 నామ శ్రీకాంత్ A3 గా గుర్తించారు. ప్రస్తుతం A3 పరారీలో ఉన్నాడు అతి త్వరలో అతని కూడా పట్టుకుంటాము,వీళ్లు వృత్తిలో భాగంగా లారీ డ్రైవర్ గా కొనసాగిస్తున్నారు,అదే తరుణంలో చతిస్గడ్ నుండి కేజీ 5000 చొప్పున కొనుగోలు చేసి గ్రామాలలో యువతను,నిరుద్యోగ యువత, కూలీలు గంజాయికి ఆకసితుల అయిన వారికీ 100 గ్రాములు 500 రూపాయలు చొప్పున అమ్ముతున్నరు అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం నందు గాంజా పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్పీ శరత్చంద్ర పవర్ ఏర్పాటు చేశారు, ఎవరైనా విక్రయించిన కొనుగోలు చేసిన 872670266 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుపవచ్చు  అని ఇన్స్పెక్టర్ కొండల్ రెడ్డి తెలిపారు.

Views: 732

About The Author

Post Comment

Comment List

Latest News