తొర్రూరు పట్టణం లో ముమ్మరంగా పోలీస్ తనిఖీలు

తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే జగదీష్

తొర్రూరు పట్టణం లో ముమ్మరంగా పోలీస్ తనిఖీలు

 

స్థానిక పట్టణ కేంద్రంలో అన్నారం రోడ్డు చౌరస్తాలో పోలీస్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించడం జరిగింది. సోమవారం ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో IMG_20240812_222328 వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిన, వాహనాలకు రిజిస్ట్రేషన్స్ పేపర్లు వాహనదారులకు లైసెన్సులు లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు వేగంగా నడిపించిన, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలుకు పంపించడం జరుగుతుందని, ఆయన తెలిపారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం  అంబేద్కర్ చౌరస్తా అన్నారం చౌరస్తా బస్టాండ్ సెంటర్ పాలకేంద్రం సెంటర్లలో తనిఖీలు నిర్వహించి వాహనదారుల రిజిస్ట్రేషన్ పత్రాలను లైసెన్సులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొర్రూర్ ఎస్సై రాంజీ నాయక్ దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు పెద్ద వంగర ఎస్సై ఉపేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 63
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News