రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనం...
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనం...

ఎల్బీనగర్ ఆగస్టు 13 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనం. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి నుంచి 8 లక్షలు లంచం తీసుకుంటుండగా పెద్ద అంబర్పేట్ ఓ ఆర్ ఆర్ పరిధిలో ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కారు. జక్కడి ముత్యం రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు తోనే జాయింట్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. ముత్యం రెడ్డి తనకన్నా 14 గంటల భూమిని ధరణి వెబ్సైట్లో ప్రోహిబిటెడ్ లిస్టు నుండి తొలగించాలని కోరాడు. అయితే సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి అందుకోసం ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడని తెలుస్తుంది. దీంతో సదరు ముత్యం రెడ్డి అదే విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు ముత్యంరెడ్డి నుంచి మదన్మోహన్ రెడ్డి కారులో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెప్తేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసిబికి చెప్పారు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి, దాంతో తమ ముందే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయాలంటూ ఎసిబి అధికారులు ఆదేశించడంతో మదమోహన్ అలాగే చేశాడు. ఎసిబి అధికారుల ముందే జాయింట్ కలెక్టర్ కు మదుమోహన్ ఫోన్ చేయడంతో పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకొని రావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పాడు. పెద్ద అంబర్పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి మదన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి నుంచి అంబర్పేట్ మున్సిపాలిటీ తట్టిన్నారం హిందువు అరణ్య ఫ్లాట్ నెంబర్ 156 రంగారెడ్డి జిల్లా అదన కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు కుటుంబ సభ్యులు బయటికి వెళ్లకుండా విచారణ సాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు పాటు పలు ఆస్తు పత్రాలు లభిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం ప్రకారం. ఈ దాడుల్లో ఏసీబీ సిటీ రేంజ్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఇన్స్పెక్టర్లు జానకిరామ్ రెడ్డి నరేష్ తదితర బృందం ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. వివరాలు తొందర్లో మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Comment List