రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..
బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..
రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..
బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
ఎల్బీనగర్, ఆగస్టు 13 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని బి.ఎన్.రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. ఎన్జీవోస్ కాలనీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డికి సమాచారం రావడంతో మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగుల పట్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆస్పత్రిలో రోగులకు సరైన చికిత్స అందడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి, ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి అయిన అన్ని రకాల సౌకర్యాలు ఉన్న కూడా రోగులకు అందుబాటులోకి తీసుకురావడం లేదని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comment List