ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

On
ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

IMG-20240815-WA0822
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇబ్రహీంపట్నం ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ..

ఘనంగా జాతీయ పతాకాల పంపిణీ..

స్ఫూర్తి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

ఇబ్రహీంపట్నం, ఆగస్ట్ 15 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం నియోజవర్గ కేంద్రంలోని ఇబ్రహీంపట్నం గ్రంథాలయం ఎదురుగా స్ఫూర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆవిష్కరణ చేశారు.  ఈ సందర్భంగా స్ఫూర్తి యూత్ ఇన్చార్జి సూరమోని బాబు మాట్లాడుతూ.. తమ స్ఫూర్తి యూత్ అసోసియేషన్  గత 24 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా ప్రతి సంత్సరం స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలను జరపటమే కాకుండా ఈ పండగ రోజు ప్రతి ఒక్కరు జాతీయ పతాకం ధరించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి జాతీయ పతాకాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరిలో  జాతీయత భావాలు, దేశభక్తి పెంపొందించడమే యూత్ లక్ష్యమని, దేశంలోని ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవాన్ని అమరుల త్యాగాలను స్మరించుకుంటూ పండగల  జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి యూత్ నాయకులు దానం సాయికుమార్, బుద్ధి దీపక్, వినయ్, వెంకటేష్, ఎస్ యాదగిరి, శివారెడ్డి, జె.సాయి రెడ్డి, మధుకర్, భాస్కర్ స్ఫూర్తి యూత్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 

Views: 11

About The Author

Post Comment

Comment List

Latest News

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్.  ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
అస్మాతపూర్‌లో ఉచిత హెల్త్ చెక్‌అప్ క్యాంపు.. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న సర్పంచ్ మంథని శివా యాదవ్.. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని...
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్
మేడారానికి 25 నుంచి ప్రత్యేక బస్సులు
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారజోరు పెంచిన సిపిఐ
ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం