29న జాబ్ మేళా
చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగులకు జాబ్ మేళా
ఉపాధి కల్పన అధికారి కే .శ్రీరామ్
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) ఆగస్టు 27: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పారమౌంట్ బిల్డింగ్ సొల్యూషన్స్, భారత్ మోటో కార్పొరేషన్ సంస్థల్లో పని చేయుటకు 100 మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29న స్థానిక మండల పరిషత్ కార్యాలయం చుంచుపల్లిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కే. శ్రీ రామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్డర్, ఫిట్టర్, సూపర్వైజర్స్ ట్రైనీ ఇంజనీర్స్, ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్ పోస్టులకు ఐటిఐ, డిప్లమా మెకానికల్, బిటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జిల్లాలోని 18 నుండి 35 సంవత్సరాలలో వయసు గల నిరుద్యోగ యువతీ,యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ లతో హాజరు కావాలని తెలిపారు.
Comment List