ఎమ్మిగనూరు లో ఉగ్రనరసింహ రూపం లో దర్శనమిచ్చిన గణనాథుడు,

విజ్ఞాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అకాక్షించిన.. ఎమ్మెల్యే బీవీ.

By Khasim
On
ఎమ్మిగనూరు లో ఉగ్రనరసింహ రూపం లో దర్శనమిచ్చిన గణనాథుడు,

న్యూస్ ఇండియా, ఎమ్మిగనూరు టౌన్, సెప్టెంబర్ 07:

వినాయక చవితి వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలోని కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి రఘువీర, ఆర్టిస్ట్ అశోక్, బండాశేఖర్, తెలుగు రాముడు, కృష్ణ, భవాని, చక్ర సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ హితం కోరుతూ కాలుష్యనివారణ లో భాగంగా వినూత్న రీతిలో గణపతులను తయారు చేస్తుంటారు. ఇందులో భాగంగా రెండు నెలలు శ్రమించి డెబ్భై కేజీలు, తొంబై వేల రుద్రాక్షల తో దాదాపు మూడు లక్షలు ఖర్చు చేసి పద్నాలుగు అడుగుల ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టించి ప్రజలకు దర్శనభాగ్యం కలిగించారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి కొండవీటి ప్రాంతం లోని ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి రఘువీర, ఆర్టిస్ట్ అశోక్, బండాశేఖర్, తెలుగు రాముడు, కృష్ణ, భవాని, చక్ర సభ్యుల ఆధ్వర్యంలో పేద మహిళలకు ఎమ్మెల్యే చేతులు మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు అయిన తరువాత మొట్ట మొదటి సారిగా వచ్చిన పండుగ వినాయక చవితి పండుగ అని 

ఆ విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షములతో విఘ్నాలు తొలగిపోయిరాష్ట్రం, రాష్ట్రం లోని ప్రజలు సుభింక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి వినూత్న రీతిలో విఘ్నేశ్వరులను తయారు చేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం శివయ్య కు ఇష్టమైన రుద్రాక్షలను శ్రీశైలం, భద్రాచలం, అరుణాచలం ప్రదేశాల నుండి డెబ్భై కేజీలు అంటే తొంభై వేల రుద్రాక్షలు, దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి పద్నాలుగు అడుగుల ఉగ్ర నరసింహ అవతారం లో విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టించి ప్రజలకు దర్శనభాగ్యం కలిగించామని, అందుకు మేము అభగవంతుని సేIMG-20240907-WA0353వలో తరిస్తున్నామని తెలిపారు.

Views: 102
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం