వినాయక విగ్రహం ప్రతిష్టించి తొలి పూజ కార్యక్రమం.
డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ
నందిగామ బిక్షం రెడ్డి, హైమావతి
డోర్నకల్ సెప్టెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి:-
వినాయక చవితి సందర్భంగా డోర్నకల్ మండలం దుబ్బ తండ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం వినాయక మండపంలో సిద్ధి వినాయకుని ఏర్పాటు చేసి తొలి పూజలు కార్యక్రమం నిర్వహించిన నందిగామ బిక్షం రెడ్డి, హైమావతి దంపతులు కలిసి మాకు ఉన్న కష్టాలను తొలగించి జీవితంలో సుఖశాంతులతో ఉండాలని వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో కలకాలం చల్లగా ఉండాలని గణేశుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలందరూ ఘనంగా జరుపుకునే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండుగ రోజు వ వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. తొమ్మిది రోజులపాటు వినాయకుడికి వివిధ రకాల నైవేద్యాలతో పూజలు చేసి తొమ్మిది రోజుల తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
Comment List