పౌర హక్కుల సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలి

సిఎల్సి జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ రావు డిమాండ్

On

కొత్తగూడెంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం

కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 14: పౌర హక్కుల సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని సిఎల్సి జిల్లా అధ్యక్షుడు ఎస్ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం  బస్టాండ్ సెంటర్లో ప్లేకార్డు, నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరకగూడెంలొ మావోయిస్టుల ఎన్కౌంటర్నికు సంబంధించి నిజనిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం (CLC) రాష్ట్ర నేతలను శనివారం మణుగూరు అశ్వాపురం పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని కొత్తగూడెం ప్రజా సంఘాల నాయకులు ఖండిస్తూ, శనివారం ప్లకార్డులు, నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎస్ ఉపేందర్ రావు మాట్లాడుతూ,.. ఎన్నడు లేని విధంగా ఈ ప్రభుత్వం జిల్లా పోలీసులు కలసి పౌర హక్కు సంఘ నేతలను నిర్బంధించడం చట్ట విరుద్ధమన్నారు. ఎన్కౌంటర్లో వారి తప్పిదాలు కప్పించుకోవడానికి పోలీసులు భయపడి సిఎల్సి నేతలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బేషరతుగా పౌర హక్కుల సంఘం నేతలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా IMG20240914115441 డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్తు రాష్ట్ర నేతలు జడ సీతారామయ్య, గౌని నాగేశ్వరరావు, ప్రజా సంఘం నాయకులు వి.సురేష్ కుమార్, మూర్తి, ఆర్ .ఉపేందర్ రావు, అలీముద్దీన్, మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు.

Views: 66
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..