ఎస్టీ రిజర్వేషన్ ను సాధించుకుందాం... మన పిల్లల భవిష్యత్ ను కాపాడుకుందాం...!

- కర్నూల్ లో 22వ తేదీన జరిగే సమావేశానికి వాల్మీకి సోదరులు హాజరు కావలెను.

On
ఎస్టీ రిజర్వేషన్ ను సాధించుకుందాం... మన పిల్లల భవిష్యత్ ను కాపాడుకుందాం...!

- వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జున్ - పిలుపు.

న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడబూరు మండలం సెప్టెంబర్ 15 :- ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ (ఏపీవిబిఎస్) సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ హాల్లో సెప్టెంబర్ 22వ తేదీన అదివారం సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు అర్జున్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ వాల్మీకి /బోయలు ఎస్టీ లో చేర్పించే విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వాల్మీకులకు న్యాయం చేయాలని కోరుతూ కర్నూలు జడ్పి హాల్లో రాష్ట్ర స్థాయి చర్చా(వర్క్ షాప్) సమావేశ కార్యాక్రమంను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో వాల్మీకి సీనియర్ నాయకులు, వాల్మీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వాల్మీకి సంఘాల నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొననున్నారని, ఆలాగే పెద్దకడబూరు మండలం నుంచి కూడా వాల్మీకి సోదరులు భారీ ఎత్తున పాల్గొని వాల్మీకి/బోయ జాతిని ఎస్టీ రిజర్వేషన్ లో చేర్చేంత వరకు తమ వంతుగా కృషి చేస్తూ సలహా సూచనాలను ఇవ్వాలని ఆదివారం పెద్దకడుబూరులోని వాల్మీకి మహర్షి విగ్రహం నందు పాల్గొన్న వాల్మీకి బోయ జిల్లా అధ్యక్షులు అర్జున్ గ్రామంలోని వాల్మీకి సోదరులను కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో పెద్దకడుబూరు మండల అధ్యక్షులు రామాంజిని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పోరాడి ఎస్టీ రిజర్వేషన్ ను సాధించుకుందామని, భవిష్యత్ లో మన పిల్లలు విద్యా రంగంలో రానించి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పుడు మనమందరం ఏకమై ప్రత్యేక రిజర్వేషన్ సాధించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మొట్రూ ఈరన్న, తలారీ అంజి, మబ్బు ఆంజినయ్య, కల్లుకుంట వీరేష్, జింక లక్ష్మన్న, దుర్గయ్య, తిక్కన్న, వెంకటేష్, లక్ష్మన్న, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.IMG_20240915_210714

Views: 142
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన* కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
జై శ్రీమన్నారాయణ,వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల...
కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో   *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!
నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు‌‌..
ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!