కెజిబివి గురుకుల పాఠశాలలో వంట ఏజెన్సీలకు శిక్షణ...!
ఈ నెల 17,18,19,20 తేదీలలో మండలంలోని పాఠశాల వంట ఏజెన్సీలు హాజరు కావలెను.
By Shabirsha
On
- మండల విద్యాశాఖ అధికారి బి. రామ్మూర్తి వెల్లడి...
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 16 :- జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు " డొక్క సీతమ్మ - మధ్యాహ్న భోజనం " పథకంపై పెద్దకడుబూరు మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వంట ఏజెన్సీలకు గ్రామాల వారీగా శిక్షణ కార్యక్రమం ఉంటుందని మండల విద్యాశాఖ అధికారి బి. రామ్మూర్తి తెలియజేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాటాడుతూ మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని కెజిబివి గురుకుల పాఠశాలలో ఈ నెల 17,18,19,20 తేదీలలో పాఠశాల వంట ఏజెన్సీలకు ఒకరోజు శిక్షణ తరగతులు ఉంటాయాన్నారు. కావున మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించి మీ వంట ఏజెన్సీ వారిని కచ్చితంగా కెజిబివి గురుకుల పాఠశాలలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ తెలిపారు.
Views: 100
Tags:

Comment List