ఖమ్మం జిల్లా HRCCI కమిటీ సభ్యుల సమావేశం
మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సింగమాల వెంకటరమణయ్యా ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఛైర్మెన్ శ్రీ దబ్బెటి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ బెస్త సంజీవరావు ఖమ్మం జిల్లా HRCCI కార్యాలయం లో ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుల సమావేశం లో దబ్బెటి శ్రీనివాస్ పాల్గొని ఖమ్మం పట్టణంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. HRCCI ముంపు ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని, అలాగే బాధితులకు ప్రభుత్వం తరపున, ఇతర సంస్థల ద్వారా,HRCCI తరపున సహాయాన్ని, కల్పించిన వసతులు మీద అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే HRCCI స్థాపించిన "ప్రశ్నించే హక్కు"పత్రిక గురించి వివరించి, ఇంఛార్జి గా చింతల రవికి భాద్యతలు అప్పగించారు. రాష్ట్ర సెక్రటరీ బెస్త సంజీవరావు మాట్లాడుతూHRCCI లో పనిచేసే ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేస్తు, పేదవారికి తగిన విధంగా మనం న్యాయం చేయడానికి ముందు ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతల రవి, జిల్లా వర్కింగ్ సెక్రెటరీ గుర్రం మనోజ్, రాంబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Comment List