ఆర్టీసీ బస్సులో డ్రైవర్ కండక్టర్ల...... చుక్క..ముక్క.. అట పాటలు..
న్యూస్ ఇండియా తెలుగు సెప్టెంబర్ 23 (మహబుబాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ డి వీరాంజనేయులు)
ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆర్టీసీ అధికారులే గిట్ల బస్సులో మందు కార్యక్రమం మొదలు పెడితే..ఎట్లా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.అవును ఇది నిజమే...ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో పరిధిలో జరిగిన ముచ్చట...
వివరాల్లోకి వెళ్తే.. మొన్న టిజిఎస్ ఆర్టీసీ జెఎసి చైర్మన్,ఈదురి వెంకన్న సారు పిలుపు మేరకు హైదారాబాద్ ఇందిర పార్క్ వద్ద ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ధర్నాకు కుసుండ్రు...అయితే ఈ ధర్నాకు తెలంగాణ నలుమూలల నుండి ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.ఇందులో భాగంగానే తొర్రూరు డిపో నుండి 10 మంది ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.ధర్నాలో బాగా వొర్రి..వోర్రి..గొంతు ఎందుకపోయిందిమో..తిరిగి హైదారాబాద్ నుండి తొర్రూరు వెచ్చే క్రమంలో మందు షాపు కాడ ఆపి..సుక్క..మంచింగ్ కు. ముక్క గ్లాసులు..నీళ్లు తీసుకున్నారట...ఇంకేముంది బస్సులో వెనక సీట్ల కుసోని..మందు కార్యక్రమ షురూ చేసిండ్రు..విశేషమేమిటంటే ఇందులో ఆ బస్సు కండక్టర్ కూడా ఉన్నాడు..అస్సల్ ప్రయాణికులకు టికెట్లు కొట్టిందా...లేదా..అనే ప్రధాన తలెత్తుతుంది.
ఇంతలో బస్సులో ఉన్న ప్రయాణికులకు మందు వాసన గప్పున రాగానే..అందులో ఒక్క అన్న లేచి బస్సులో చిన్నపిల్లలు ఉన్నారు.ఇలా బస్సులో..తాగడం సరికాదని ఒరిండు...అయిన కండక్టర్ జంకకుండ.. ప్రయాణికులపై విరుచుకు పడ్డారు.ఆర్టీసీ అధికారులకు ఎందో ఏమో..ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన ఆర్టీసీ అధికారులే ...ఈ విధంగా బస్సులో చుక్క ముక్క కార్యక్రమం పెట్టడం సరికాదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అట్టి మందుబాబులకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comment List