మునిగే దెవరు?తేలేదెవరు?

On

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు. ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది. పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష […]

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పోలింగ్‌కు మరో పక్షం రోజులుండగానే ఎదుటి పార్టీ కంటే ఎక్కువ డబ్బులిస్తామని, తమకే ఓటేయాలని వివిధ పార్టీల నాయకులు వేలం పాటలా ఆశ చూపుతున్నారు.

ఓటర్లు కూడా వీలైనంత రాబట్టుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. పలు గ్రామాల్లో ఓటుకు ఇంత ఇవ్వాలని ప్రజలే డిమాండ్‌ చేస్తున్నారు. ఒక పార్టీ ఆ డిమాండ్‌కు ఒప్పుకొంటే ప్రత్యర్థి పార్టీ అంతకంటే ఎక్కువిస్తామని ముందుకొస్తోంది.

పోలింగ్‌ దగ్గర పడేకొద్దీ ప్రత్యక్ష ప్రచారంతో పాటు సామాజిక మాధ్యమాల్లో అనుకూల, వ్యతిరేక ప్రచారాలూ ముమ్మరమయ్యాయి. ఓటుకు ఇంత అని వాగ్దానం చేస్తున్న నాయకులు ఆ గ్రామంలోని ముఖ్య నాయకులకు అడ్వాన్సుగా కొంత మొత్తం ఇచ్చి ప్రమాణం చేయిస్తున్నారు. వారి ఓట్లన్నీ గంపగుత్తగా తమ పార్టీకే వేసేలా చూడాలని కిందిస్థాయి నాయకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. డబ్బులు తీసుకున్న నాటి నుంచి తమ పార్టీకి మద్దతుగా ప్రచారం, ఇతర కార్యక్రమాలకు వారిని రప్పించాలని కూడా నిర్దేశిస్తున్నారు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్