మాతా శిశు ఆస్పత్రిని సందర్శించిన కోనేరు సత్యనారాయణ
ఆస్పత్రిలోని సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్న కోనేరు
కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరోనరేష్) సెప్టెంబర్ 26: రామవరం లోని మాత శిశు ఆసుపత్రిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) గురువారం సందర్శించారు. ఆస్పత్రిలోని సౌకర్యాల గురించి రోగులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ఆస్పత్రిలోని సమస్యల గురించి తెలుసుకొని ప్రత్యక్షంగా చూడటానికి వచ్చానని అన్నారు. పదిమంది వైద్యులు ఉండవలసిన ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. స్కానింగ్ కోసం వచ్చే రోగులు బయట ఆశ్రయించి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారన్నారు. వాటర్ సమస్య, ముఖ్యంగా మందులు బయట నుంచి రోగులు కొనుగోలు చేయవలసి వస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆస్పత్రి సమస్యలను పరిష్కరించాలని కోరారు. త్వరలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీ కూడా కలిసి ఆసుపత్రి సమస్యలపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమర్ ,మామిడి రాజేశ్వర్ ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు ,22వ వార్డు కౌన్సిలర్ మసూద్ ,రవి గౌడ్,సీనియర్ నాయకులు దొమ్మేటి నాగేశ్వరరావు ,మైనార్టీ సెల్ అధ్యక్షుడు జానీ పాషా,బీసీ సెల్ జిల్లా కన్వీనర్ సత్యరాజ్,మాల మహానాడు జిల్లా కన్వీనర్ జెట్టి మోహన్,హుస్సేన్ భాయ్,హరి సింగ్,కళ్యాణ్,మల్లారపు కొమురయ్య,గణేష్,నజీర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List