ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో "సేవ సే సీఖేన్ - 2024" అనుభవాత్మక అభ్యాస కార్యక్రమం

On
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో "సేవ సే సీఖేన్ - 2024" అనే అనుభవాత్మక అభ్యాస కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క యువజన వ్యవహారాల విభాగం అయిన *మేరా యువభారత్* సంస్థ నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి ఖమ్మం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యం వహిస్తున్నారు.

మేరా యువ భారత్(మై భారత్) తరపున జిల్లా అధికారి అన్వేష్ చింతల మరియు అకౌంట్స్ మరియు ప్రోగ్రామ్ అధికారి  కమర్తపు భానుచందర్  ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమం కోసం మై భారత్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 12 మంది అభ్యర్థులలో, 5 మంది విద్యార్థులు ఎంపిక చేయబడ్డారు. ఈ విద్యార్థులు 120 గంటల పాటు( 30 నుండి 60 రోజులు) జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వీరికి ప్రత్యేక ధ్రువపత్రాలు అందజేయబడతాయి.

Read More అవంతి గ్రూప్స్ ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తా చైర్మన్ శ్రీనివాసరావు..

ఈ అనుభవాత్మక అభ్యాస కార్యక్రమం ద్వారా యువతకు ఆసుపత్రి సేవలపై అవగాహన కల్పించడం, వారిలో సామాజిక సేవా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వైద్య రంగంలో ప్రాయోగిక అనుభవాన్ని పొందడమే కాకుండా, సమాజ సేవలో తమ వంతు పాత్రను నిర్వహించే అవకాశం కూడా లభిస్తుంది.
 - Anvesh Chinthala,
District Youth Officer,
My Bharat (NYK) Khamman.
9491383832

Read More బాధిత కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరుచేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం...!

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News