అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా 14500/- ఆర్థిక సహాయంతో చేయూత...!

- వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురాముడు, దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్ లు బాధిత కుటుంబానికి భరోసా...

On
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా 14500/- ఆర్థిక సహాయంతో చేయూత...!

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 29 :- మండలకేంద్రమైన పెద్దకడుబూరులోని స్థానిక ఎస్సి కాలనిలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన మంచోది శాంతిరాజు కుటుంబానికి అండగా నిలుస్తూ శనివారం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు 10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు. అలాగే మాజీ ఎంపీపీ రఘురాముడు 2500/- మరియు దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్ 2వేల రూపాయలు చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యులెవ్వరు అధర్యపడొద్దని, అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్థి నస్టానికి ప్రభుత్వం నష్ట పరిహారం సత్వరమే బాధిత కుటుంబానికి అందేలా ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపి నేతలు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రా రెడ్డి, విజేంద్ర రెడ్డి, శివరామి రెడ్డి మరియు వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, జాము మూకయ్య, సుందరం, ప్రసాద్, ఏసన్న, లోకేష్, ఆంజినయ్య మరియు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG_20240928_131829

Views: 52
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News