అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని జెబి ఇన్ ఫ్రా గ్రూప్ సూచన...

జేబి గ్రూప్ పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు..

On
అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని జెబి ఇన్ ఫ్రా గ్రూప్ సూచన...

జేబి గ్రూప్ పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు. అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని జెబి ఇన్ ఫ్రా గ్రూప్ సూచన. హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు..

జేబి గ్రూప్ పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు..

అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని జెబి ఇన్ఫ్రా గ్రూప్ సూచన..

హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు...

ఎల్బీనగర్, అక్టోబర్ 4 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రియల్ ఎస్టేట్ రంగంలో 23 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో కొనుగోలుదారుల విశ్వసనీయత, నమ్మకమే పెట్టుబడిగా మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నామని జేబీ ఇన్ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే తమకున్న బ్రాండ్ వాల్యూను దుర్వినియోగం చేస్తూ, జేబి గ్రూప్ పేరిట కొన్ని  మోసపూరిత కంపెనీలు చెలామణి అవుతున్నట్లుగా,  అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. పెద్ద అంబర్ పేట్ లో జేబీ గ్రూప్ బ్రాంచ్ ఆఫీసులో శుక్రవారం మీడియా సమావేశంలో మేనేజింగ్ పార్టనర్ సిద్ధార్థ రెడ్డి, సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్లతో కలిసి మీడియాకు వివరించారు. ఈ విషయంలో వాస్తవాలను తెలుసుకొని కొనుగోళ్ళు చేయాలని సూచించారు.  జేబీ గ్రూప్ బ్రాండ్ పేరిట జరుగుతున్న మోసాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని అనిల్ స్పష్టం చేశారు.  ఇప్పటికే కొందరు కొనుగోలుదారులు నష్టపోయినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. మార్కెట్లో జరుగుతున్న మోసాలకు తమ గ్రూప్నకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మొదటి నుంచీ ఈ కంపెనీలో నలుగురు మాత్రమే మేనేజింగ్ పార్టనర్లు ఉన్నారని, హైదరాబాద్ కేంద్రంగా నాలుగు కార్యాలయాలు మాత్రమే పనిచేస్తునట్లుగా పేర్కొన్నారు. మార్కెట్ లో తమ బ్రాండ్ పేరిట జరుగుతున్న మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమ బ్రాండ్ విలువకు తగ్గించేలా జరుగుతున్న మోసాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేబి ఇన్ఫ్రా

Read More అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..

IMG_20241004_22225726
నకిలీ బ్రోచర్స్ చూపిస్తున్న జేబీ ఇన్ ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ రెడ్డి...

సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...

Views: 81

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి