నూతన బస్సు సర్వీసు ప్రారంభం

కృతజ్ఞతలు తెలిపిన పులిగిల్ల గ్రామ ప్రజలు

On
నూతన బస్సు సర్వీసు ప్రారంభం

నూతనంగా బస్సు సర్వీసును ఉప్పల్ నుండి పులిగిల్ల వరకు శుక్రవారం రోజున పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించబడిన ఈ బస్సు సర్వీసు కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, జిల్లా జాయింట్ సెక్రెటరీ పాశం స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జక్కా దామోదర్ రెడ్డి లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి పులిగిల్లకు బస్సు సర్వీసును పంపించాల్సిందిగా కోరడంతో వెంటనే డిపో మేనేజర్ తో మాట్లాడడంతో  వారు  స్పందించి బస్సు సర్వీసును పునరుద్ధరించడంScreenshot_2024_1010_201150 జరిగింది. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ గ్రామం నుండి హైదరాబాదుకు వెళ్లడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఎమ్మెల్యే ఎంపీ చేసిన కృషికి గ్రామ ప్రజలందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎంపిటిసి బండారు ఎల్లయ్య, వాకిటి సంజీవరెడ్డి, పైళ్ళ రవీందర్ రెడ్డి బుగ్గ బీరప్ప, పల్సం భాస్కర్, బుగ్గ మనోజ్, బండారు మైసయ్య, వాకిటి వెంకట్ రెడ్డి, పర్వతం రాజు, పల్లెర్ల యాదగిరి, మారబోయిన రాజు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 70

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్