తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య..

On
తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య..

కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ని కూల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.రాత్రికి రాత్రి కూల్చివేతలు ..కలెక్టర్, ఎమ్మార్వో ఇతర ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే చేసి మరీ పట్టా ఇచ్చారు.

కిన్నెర మొగులయ్యకు అన్యాయం 
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ని కూల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు..

IMG-20241011-WA0451
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పట్టా సర్టిఫికెట్ తీసుకున్న మొగిలయ్య..

ఎల్బీనగర్, అక్టోబర్ 11 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ప్రతినిధిపద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర మొగులయ్య కన్నీరు పెట్టుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన స్థలాన్ని ఇటీవల రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో,  ఇతర రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేసి మరీ కిన్నెర మొగలియ్యకు పట్టా అందజేశారు. దీంతో అతడు ఆ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాడు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ కాంపౌండ్ వాల్ని కూల్చివేశారు. బాధితుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ మధ్యనే సర్వే చేసి మరీ తనకు పట్టా అందజేశారని, ప్రభుత్వం కేటాయించిన భూమికే ఇలా ఎసరు పెడితే ఎలా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.

Views: 20

About The Author

Post Comment

Comment List

Latest News