ఇల్లందులో విలేకరిపై దాడి అమానుషం

దాడిని ఖండించిన పాత్రికేయ సంఘాలు, పాత్రికేయులు

On
ఇల్లందులో విలేకరిపై దాడి అమానుషం

జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసి వినతి పత్రం అందజేత

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ ) ఇల్లెందులోIMG-20241019-WA0901 రాత్రి విలేఖరి సుదర్శన్ పై దుండగులు మారనాయుధాలతో దాడి చేయడం అమానుషమని కొత్తగూడెం  పాత్రికేయ సంఘాలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. సుదర్శన్ పై దాడిని నిరసిస్తూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పాత్రికేయ సంఘాలు పాత్రికేయులు శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సుదర్శన్ పై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్టు చేయడం అందుకు ఎస్పీ చొరవ తీసుకున్నందుకు పాత్రికేయులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ పాత్రికేయులతో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు మునుముందు పునరావృత్తం  కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పాత్రికేయులకు సూచించారు.  జిల్లా వ్యాప్తంగా  పాత్రికేయులు విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా   ఎవరైనా దాడి చేసే అవకాశాలు ఉన్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని పాత్రికేయులకు సూచించారు. ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో టి యు డబ్ల్యూ జె (టి జె ఎఫ్ ) 143  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ,జిల్లా సహాయ కార్యదర్శి అచ్చి  ప్రభాకర్ రెడ్డి, టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, టి యు డబ్ల్యూ జె (ఐజేయు ) ఇమంది ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు ఎర్ర ఈశ్వర్, జాయింట్ సెక్రెటరీ  సత్యానంద్ ,  టి యు జె ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్  పోనిశెట్టి  రమేష్, నాయకులు దాసరి వెంకటేశ్వర్లు (డివి  ),చిన్న పత్రికల ప్రధాన కార్యదర్శి అబ్జల్ పఠాన్, సీనియర్ పాత్రికేయులు మోటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ,ఆదాబ్ హైదరాబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టాప్ రిపోర్టర్  శ్రీనివాస్,మన తెలంగాణ జిల్లా స్టాఫర్ క్రాంతి కుమార్, వార్త సురేష్ ,ఆదాబ్ సింగరేణి ప్రతినిధి ఠాకూర్ సింగ్, డేవిడ్ జాన్సన్ బాబు, న్యూస్ ఇండియా నరేష్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు వివిధ పాత్రికేయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Views: 180
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..