పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*
గ్రామపంచాయతీ మంచినీటి సహాయకుల ద్వారా త్వరిత గతిన సమస్యల పరిష్కారం.
పాలకుర్తి మండల ఎంపీడీవో కార్యాలయం లో గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*
న్యూస్ ఇండియా తెలుగు, పాలకుర్తి నియోజకవర్గం. ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్, అక్టోబర్ 19,
పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని గ్రామాల పరిధిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి మంచినీటి సహాయక శిక్షణను అనగా చేతిపంపు రిపేర్, మరియు ఎలక్ట్రిక్ సింగల్ ఫేజ్, మరియు ప్యానెల్ బోర్డు రిపేర్, ప్లంబింగ్ పైప్ లైన్ లీకేజీ, గేటు వాల్ రిపేర్లు, నీటీ నాణ్యత పై అవగాహన కార్యక్రమాన్ని గత నాలుగు రోజుల నుంచి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వారికి ఈరోజు పాలకుర్తి ఎంపీడీవో, డి పీ ఓ, మరియు మిషన్ భగీరథ ఏఈ, లు మంచినీటి సహాయకునీ యొక్క ధ్రువీకరణ పత్రాన్ని సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ గ్రామ మంచినీటి సహాయకులు ద్వారా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తిన త్వరితగతి న సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని అన్నారు.
Comment List