రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ప్రో కబడ్డీ పోటీల తరహాలో నిర్వహణ

On
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ప్రతి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈ పోటీలను విజయవంతం చేయాలి... జారే ,కోరం

 కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరోనరేష్) 26: రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా పిఎస్ఆర్ ట్రస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 28,29,30 తేదీలలో రాష్ట్రస్థాయి కబడ్డీ (ఇన్విటేషన్) పోటీలను నిర్వహిస్తున్నట్లుగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లేంది ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. శనివారం కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోగల కూడా పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు మంచి ప్రాధాన్యతనిస్తూ, యువత చెడు మార్గంలో వెళ్లకుండా యువతను క్రీడలలో ముందుకు తీసుకురావాలని, యువతను చైతన్య పరుస్తున్నారని, అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో  గ్రామీణ క్రీడగా కబడ్డీ క్రీడకు మంచి గుర్తింపు ఉన్నందున, ఈ యొక్క పోటీలను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రో కబడ్డీ పోటీలకు దీటుగా ఈ పోటీలను సింథటిక్, బ్లడ్ లైటింగ్ వెలుగులో, అనుభవజ్ఞుడైన రెఫ్రిస్ తో ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ పోటీలలో రాష్ట్రం నుంచి ఆరు మహిళా జట్లు, పది పురుషుల జట్లు పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో క్రీడ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు . ఈ పోటీలో 1,2,3,4 స్థానాలలో నిలిచిన వారికి 30వ తారీకు చివరి రోజు పొంగులేటి శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా భద్రాద్రి జిల్లాలోని ప్రో కబడ్డీ ఆడిన ఆరుగురు క్రీడాకారులతో పాటు సీనియర్ కాబట్టి క్రీడాకారులను సత్కరించన్నారని తెలిపారు. ఈ యొక్క క్రీడ పోటీలను ప్రతి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్, జనరల్ సెక్రటరీ స్వాతిముత్యం, మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర త్రివేది, తూము చౌదరి, నాయకులు పెదబాబు, జెవిఎస్ చౌదరి, కౌన్సిలర్లు వై శ్రీనివాస్ రెడ్డి, తలుగు అనిల్, నాయకులు రాయల శాంతయ్య, మైనారిటీ నాయకులు మహమ్మద్ గౌస్, అయూబ్ ఖాన్, జానీ భాయ్, మహిళా నాయకురాళ్లు హైమావతి, వాణిరెడ్డి, రమాదేవి, సుప్రియ మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 52
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్