నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన
On
అవినీతి రహిత భారతదేశం అందరి లక్ష్యంమని దానికోసం అందరూ కృషి చేయాలని ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి భూక్య ప్రవీణ్ సింగ్ గారి ఆదేశాల మేరకు అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ గారి సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ఖమ్మం మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిర్మూలనపై వ్యాసరచనలు పోటీలు నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ మరియు ర్యాలీ తీసుకోవడం జరిగింది. గాంధీ చౌక్ లోని కొన్ని షాపుల దగ్గరికి వెళ్లి విజిలెన్స్ - అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించి ఐ ఈ సి మెటీరియల్ పంచడం జరిగింది. ఇందుకు సహకరించినందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి నెహ్రు యువ కేంద్ర తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 May 2025 20:26:02
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
Comment List