జాతీయస్థాయి వాలీబాల్ పోటిలకు జీడి హన్సిని

వివిసి విద్యార్థిని హన్సినిని అభినందించిన మంత్రి పొంగులేటి

On
జాతీయస్థాయి వాలీబాల్ పోటిలకు జీడి హన్సిని

జాతీయస్థాయి వాలీబాల్ పోటిలకు వివిసి విద్యార్థిని జీడి హన్సిని ఎంపీకైంది. విద్యార్థిని జీడీ హన్సిని, వాలీబాల్ కోచ్ అక్బర్ అలీ సోమవారం రెవిన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... హన్సిని జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. జాతీయ స్థాయి పోటీలలో కూడా బాగా రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు. 

         స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వారు అక్టోబర్ నెల 28, 29, 30 తేదిలలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటిలలో ఖమ్మం జిల్లా టీమ్ ప్రధమస్థానంలో విజయం సాధించింది. ఈ పోటిలలో అత్యంత ప్రతిభ కనబర్చిన వివిసి స్కూల్ విద్యార్థిని జీడి హన్సినీని "స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా" వారు ఈ నెల 6నుండి 11వ తేదిలలో రాయ్ బరేలి (ఉత్తర ప్రదేశ్)లో నిర్వహించే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికచేశారు. హన్సిని ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వాలీబాల్ కోచ్ అక్బర్ అలీ వద్ద శిక్షణ పొంది జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనందున కోచ్ అక్బర్ అలీని, హన్సీనీని మంత్రి పొంగులేటి అభినందించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ సునీల్ రెడ్డి, ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ, స్కూల్ ప్రిన్సిపాల్ హన్సినిని అభినందించి జాతీయ స్థాయిలో కూడా బాగా రాణించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.

Views: 81
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News