బి ఎస్ రావు ఆధ్వర్యంలో మెగా క్రికెట్ పోటీలు ప్రారంభం

మొదటి మ్యాచ్ లో పోలీస్ జట్టు విజయం

On
బి ఎస్ రావు ఆధ్వర్యంలో మెగా క్రికెట్ పోటీలు ప్రారంభం

రెండో మ్యాచ్ లో సింగరేణి జట్టు విజయం

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) నవంబర్8: డాక్టర్ బి ఎస్ రావు ఆధ్వర్యంలో మెగా విఐపి క్రికెట్ పోటీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి వెంకట్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కోచ్ సన్నీ సోబర్స్ సహాయ సహకారాలతో కొత్తగూడెం ప్రకాశం మైదానంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ 8,9,10,11 తేదీల వరకు నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. మొదటిరోజు ప్రారంభమైన మ్యాచ్IMG-20241108-WA1452 లో పోలీస్ మరియు డాక్టర్ జట్లు తలపడగా, పోలీస్ జట్టు సునాయాసగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 224 /7పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన డాక్టర్స్ జట్టు 162 /4 పరుగులు చేసి ఓటమిపాలైంది. పోలీస్ జట్టులో రమణారెడ్డి(59), గోపాల్ ( 50) నాగరాజు (31) అత్యధిక పరుగులను అందించారు.

రెండో మ్యాచ్ వివరాలు...

సింగరేణి జట్టు మరియు పంచాయతీరాజ్ జట్లు తలపడగా సింగరేణి జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 229/4 పరుగులు సాధించింది, పంచాయతీరాజ్ జట్టుకు230 పరుగుల విజయ లక్ష్యాన్ని వారి ముందు ఉంచగా,19.3 ఓవర్లు ముగిసే సమయానికి 108 /10పరుగులతో ఓటమి పాలైంది. సింగరేణి జట్టులో సాయి రాకేష్ (105) పరుగులు, నాగమోహన్ (65) పరుగులు చేసి అత్యధిక పరుగులను అందించారు.

Views: 105
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News