ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పై నేషనల్ వైడ్ గా క్రేజ్

On

పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్. బాహుబలితో ఇటు రాజమౌళికి అటు ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాలపై అంచనాలు అన్ని బాషల్లోనూ ఓ రేంజ్ లో ఉన్నాయి. రాధేశ్యామ్ ని గోపికృష్ణా సంస్థ, యువి క్రియేషన్స్ కలిపి 200ల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే…డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ మూవీకి 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే 400 కోట్ల […]

పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్. బాహుబలితో ఇటు రాజమౌళికి అటు ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాలపై అంచనాలు అన్ని బాషల్లోనూ ఓ రేంజ్ లో ఉన్నాయి. రాధేశ్యామ్ ని గోపికృష్ణా సంస్థ, యువి క్రియేషన్స్ కలిపి 200ల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే…డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ మూవీకి 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు.

ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే 400 కోట్ల బడ్జెట్ పెట్టినా అక్కడుంది రాజమౌళి కాబట్టి తన మార్కెటింగ్ స్ట్రాటజీతో దానికి డబుల్ తీసుకొస్తాడనే నమ్మకం ఉంది. అది నిజమైంది కూడా. ఆర్ఆర్ఆర్ టోటిల్ రైట్స్ దాదాపు 900ల కోట్లకు జరిగిందనే టాక్ ఉంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు, బాలీవుడ్ నుంచి అలియాభట్, అజయ్ దేవగన్ కూడా ఉండటం కూడా హెల్ప్ అయ్యింది.

రాధేశ్యామ్ జనవరి 14న విడుదలకు సిద్దమైంది. రాధాకృష్ణకుమార్ డైరెక్షన్లో పీరియాడిక్ లవ్ స్టోరీగా వస్తోంది ఈ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. పాటలు బాగానే మెప్పించాయి. ట్రైలర్ వచ్చాక ఈ సినిమాపై బజ్ ఏర్పడిందని చెప్పాలి. మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం ప్రబాస్ కోసం సినిమా చేసేవాళ్ళకు ఇది కాస్త మైనస్ అని చెప్పాలి. అయిన లవ్ స్టోరీ, గ్రాండ్ విజువల్స్ తో ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకంతో యూనిట్ లో కనిపిస్తోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ