బైక్ దొంగ అరెస్ట్

8 బైకులు స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు

On
బైక్ దొంగ అరెస్ట్

వివరాలు వెల్లడించిన సిఐ కరుణాకర్

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)డిసెంబర్‌4: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైకుల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని వన్‌ టౌన్‌  పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ ఎం.కరుణాకర్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ వెల్లడిస్తూ..IMG-20241204-WA1420 ఈజీ మనికి అలవాటు పడిన భద్రాచలం పట్టణానికి చెందిన గుమ్మడి రాజు గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సా జీవితాన్ని గడుపుతున్నాడు. మంగళవారం రాత్రి కోతగూడెం బస్టాండ్‌ సెంటర్‌లో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా రాజు ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది.అతన్ని పోలీసులు ప్రశ్నించగా పొందలేని సమాధానం చెప్పడంతో అతని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటీవల కాలంలో ఖమ్మంలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించాడు. రాజును పోలీసులు అరెస్టు చేసి ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ స్పష్టం చేశారు. దొంగను అదుపులోకి తీసుకోవడంలో కృషిచేసిన సిఐ కరుణాకర్‌, కానిస్టేబుల్‌, శంకర్‌ ,సురేష్‌ నరేష్‌లను డిఎస్పి అబ్దుల్‌ రెహమాన్ ప్రత్యేకంగా అభినందించారు.

Views: 177
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి