ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువాయే ...

కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సాంబశివరావు 

On
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కరువాయే ...

వైద్యుల కొరతతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

కొత్తగూడెం (న్యూస్ఇండియా నరేష్) డిసెంబర్ 5: కొత్తగూడెం సర్వేజనా ఆస్పత్రిని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆస్పత్రిలోని వైద్యులు 34 మందికి గాను,12 మంది వీధుల్లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు . ఎక్స్రే , సిటీ స్కాన్ ,రేడియాలజిస్ట్ విభాగాల్లో పదిమంది టెక్నీషియన్స్ కు గాను ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వెటిలెటారులు 25కి గాని నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇలా వైద్యుల కొరత, సమయపాలన లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ ను సాధ్యమైనంత తొందరగా ప్రక్షాళన చేసే అవసరం ఉందన్నారు. వారంలో ఏదో ఒక రోజు ఆకస్మికంగా తనిఖీకి వస్తానని  వైద్యులను హెచ్చరించారు. ఆస్పత్రి సమస్యలపై కలెక్టర్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబిర్ పాషా, చంద్రగిరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Views: 123
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News